ప్రాజెక్ట్ కే ఫస్ట్ గ్లింప్స్ ..ప్రభాస్ కుమ్మేసాడు

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ – నాగ్ అశ్విన్ కలయిక లో ప్రాజెక్ట్ కే మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఎవెంజర్స్ తరహాలో రాబోతున్న ఈ మూవీ తాలూకా ఫస్ట్ గ్లింప్స్ ను మేకర్స్ రిలీజ్ చేసారు. ఈ గ్లింప్స్ చూసి అభిమానుల సంతోషం మాములుగా లేదు. ఫస్ట్ లుక్ తో కాస్త నిరాశ వ్యక్తం చేసిన ఫ్యాన్స్ గ్లింప్స్ తో అంచనాలు పెంచేసుకుంటున్నారు.

నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ఈ మూవీని వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై అశ్వినీదత్ నిర్మిస్తున్నారు. ఇందులో దీపిక పదుకొణె, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, దిశా పటానీ సహా ఎంతో మంది ప్రముఖులు కీలక పాత్రలు చేస్తున్నారు. ఈ మూవీకి సంతోష్ నారాయణన్ సంగీతాన్ని అందిస్తున్నారు.

ప్రాజెక్ట్ కె అని వర్కింగ్ టైటిల్ తో సినిమాని స్టార్ట్ చేసి మేగ్జిమమ్ షూటింగ్ కంప్లీట్ చేసేశారు. ఫ్యూచరిస్టిక్ కాన్సెప్ట్ తోనే సైన్స్ ఫిక్షన్ జోనర్ లో ఈ సినిమా తెరకెక్కుతోంది. యూఎస్ లో కామిక్ కాన్ ఈవెంట్ లో మూవీ ఫస్ట్ గ్లింప్స్, టైటిల్ ని ఆవిష్కరించారు. గ్లింప్స్ లో చూపించిన కొన్ని ఎలిమెంట్స్ అయితే హిందువులకి భాగా కనెక్ట్ అయ్యే విధంగా ఉన్నాయి. ఇండియన్ మైథాలజీ రిఫరెన్స్ తో తీసుకున్న ఎలిమెంట్స్ అయితే గూస్ బాంబ్స్ అని చెప్పొచ్చు.

గ్లింప్స్ వీడియో లో ఓ విలన్ చేతిలో హనుమాన్ సిల్వర్ లాకెట్ ని చూపించారు. అది పట్టుకోగానే అతని చేతులు వణుకుతాయి. దాంతో హనుమాన్ పవర్ ని ఆ సీన్ తో రిప్రజెంట్ చేశారు. అలాగే పద్మకారం ఉన్న ఒక స్థలాన్ని చూపించారు. దీంతో పాటుగా ఓ గృహలో పరశురాముడు తపస్సులో ఉన్నట్లు రివీల్ చేశారు. అతని నుంచి హీరో కల్కి అందుకున్న పరుశవేది అనే ఆయుధాన్ని ఆవిష్కరించారు. శ్రీమహా విష్ణు ఉపయోగించే సుదర్శన చక్రాన్ని రిప్రజెంట్ చేశారు. అలాగే ఓ గృహలో శివలింగాన్ని విజువల్ లో చూపించారు. పరశురాముడు జ్ఞాన యోగం నుంచి మేల్కొని నందక ఖడ్గం ప్రయోగించిన విజువల్ ఆవిష్కరించారు. ఈ అంశాలు అన్ని కూడా ఇండియన్ మైథాలజీని పూర్తిగా రెప్లికేట్ చేసే విధంగా ఉన్నాయని చెప్పొచ్చు.

YouTube video