‘నేను కాంగ్రెస్ పార్టీలో చేరడం కంటే బావిలో మునగడం మేలు’ఃనితిన్‌ గడ్కరీ

‘Would rather drown in a well’: Nitin Gadkari’s response to advice on joining Congress

న్యూఢిల్లీః కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో జరిగిన కార్యక్రమంలో పారిశ్రామికవేత్తలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన తాను కాంగ్రెస్‌ పార్టీలో చేరికపై మాట్లాడుతూ.. ఓ మిత్రుడు తనకు కాంగ్రెస్‌ పార్టీలో చేరాలని సలహా ఇచ్చాడని గడ్కరీ పేర్కొన్నారు. అయితే, దీనికి తాను ‘నేను కాంగ్రెస్ పార్టీలో చేరడం కంటే బావిలో మునగడం మేలు’ అని సమాధానం చెప్పినట్లు తెలిపారు. ‘నా మిత్రుడు శ్రీకాంత్ జిచ్కార్ కాంగ్రెస్ పార్టీలో ఉండేవాడు. నేను మంచి వాడినని, ఉండకూడని పార్టీలో ఉన్నానని అన్నాడు.

మంచి భవిష్యత్‌ కోసం కాంగ్రెస్‌లో చేరాలని నాకు చెప్పాడు. నేను జిచ్కార్‌కు ఓ విషయం చెప్పాను. బావిలోనైనా మునుగుతాను కానీ.. కాంగ్రెస్‌లో చేరనని మాత్రం చేరను. ఎందుకంటే నాకు కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు నచ్చవు’ అని చెప్పినట్లు గడ్కరీ తెలిపారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అమెరికా మాజీ అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్ ఆత్మకథలోని వ్యక్తి ఓడిపోయినప్పుడు పూర్తికాదు, నిష్క్రమిస్తేనే పూర్తి అవుతాడన్న వాక్యాన్ని యువ పారిశ్రామికవేత్తలు గుర్తుంచుకోవాలని గడ్కరీ పిలుపునిచ్చారు.

వ్యాపారం, సామాజిక సేవ, రాజకీయాల్లో ఉన్న ఎవరికైనా మానవ సంబంధాలే అతిపెద్ద బలమన్న గడ్కరీ.. అందుకే ఎవరూ ఎవరిని వాడుకొని వదిలేయడం చేయకూడదన్నారు. అవి ఎలాంటి రోజులైనా.. ఒకసారి ఎవరి చేయి పట్టుకున్నామంటే.. దాన్ని ఎప్పటికీ వదిలేయవద్దు అన్నారు. ఇదిలా ఉండగా.. నితిన్‌ గడ్కరీని ఇటీవల బిజెపి అధిష్ఠానం బిజెపి పార్లమెంట్‌ నుంచి తొలగించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో గడ్కరీ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/andhra-pradesh/