ఆధార్ జిరాక్స్ కాపీలు ఎవ్వరికీ ఇవ్వొద్దు – కేంద్రం సూచన

ఆధార్ జిరాక్స్ కాపీలు ఎవ్వరికీ ఇవ్వొద్దు అని కేంద్రం సూచించింది. ప్రతీ విషయంలోనూ ఆధార్‌ను వాడుతున్న నేపథ్యంలో.. ఏ విషయంలోనైనా ఆధార్ కార్డును ఇతరులకు ఇవ్వాల్సి వస్తే.. కేవలం ‘మాస్క్‌డ్ కాపీ’లను మాత్రమే ఇవ్వాలని కేంద్రం స్పష్టం చేసింది. అయితే, ఆధార్ కార్డును దుర్వినియోగం చేయకుండా ఉండేందుకే ఇలా చేయాలని కేంద్రం కోరింది. ముందు జాగ్రత్త కోసమే ఇలా సూచన చేస్తున్నట్లు కేంద్రం ఓ ప్రకటనలో తెలిపింది. అందుకే ఎవరికైనా ఫొటోకాపీకి బదులుగా మాస్క్‌డ్ కాపీలను మాత్రమే చూపించాలని స్పష్టం చేసింది.
‘మీ ఆధార్ జిరాక్స్ కాపీని ఏ సంస్థకూ ఇవ్వకండి, ఎందుకంటే, అది దుర్వినియోగమయ్యే అవకాశం ఉంటుంది. ప్రత్యామ్నాయంగా మీరు మీ ఆధార్ సంఖ్యలో చివరి నాలుగు అంకెలు మాత్రమే కనిపించేవిధంగా మాస్క్‌డ్ ఆధార్‌ను మాత్రమే ఇవ్వండి’’ అని ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇతరుల ఆధార్ కార్డుల కాపీలను సేకరించి, తమ వద్ద ఉంచుకునేందుకు హోటళ్ళు, సినిమా హాళ్ళు వంటి లైసెన్స్ లేని సంస్థలకు అనుమతి లేదని తెలిపింది. భారత దేశ విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ నుంచి యూజర్ లైసెన్స్ పొందిన సంస్థలు మాత్రమే వ్యక్తిని గుర్తించేందుకు ఆధార్‌ను ఉపయోగించవచ్చునని ‘ తెలిపింది.
మాస్క్‌డ్ ఆధార్ కాపీలను ఎలా పొందాలంటే..
Official UIDAI website నుంచి మాస్క్‌డ్ ఆధార్ కార్డును డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.- మీ 12 అంకెల ఆధార్ కార్డు సంఖ్యను ఈ వెబ్‌సైట్‌లో ఎంటర్ చేయాలి.
‘Do you want a masked Aadhaar’ ఆప్షన్‌ను ఎంచుకోవాలి.
మాస్క్‌డ్ ఆధార్ కాపీని డౌన్‌లోడ్ చేసుకోవాలి.