మంచు లక్ష్మి “అగ్ని నక్షత్రం” ఫస్ట్ గ్లింప్స్‌ విడుదల

కలెక్షన్ కింగ్ మోహన్ బాబు..తన కుమార్తె మంచు లక్ష్మి కలయికలో తెరకెక్కుతున్న మూవీ అగ్ని నక్షత్రం. ప్రతీక్ ప్రజోష్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ ని శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్, మంచు ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై మోహన్ బాబు,లక్ష్మీ ప్రసన్నలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సముద్రఖని, విశ్వంత్‌, చిత్ర శుక్లా, మలయాళ నటుడు సిద్ధిక్‌ ఇతర కీలక పాత్రలు పోషించారు.

త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో సోమవారం చిత్రం తాలూకా ఫస్ట్ గ్లింప్స్‌ను చిత్ర బృందం రిలీజ్ చేసింది. ఈ గ్లింప్ తో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. వీడియో చూస్తుంటే ఇదొక పోలీస్ స్టోరీ అని అర్థం అవుతుంది. ఇందులో ప్రొఫెసర్‌‌‌‌‌‌‌‌ విశ్వామిత్ర అనే డిఫరెంట్ క్యారెక్టర్‌‌‌‌‌‌‌‌లో మోహన్ బాబు కనిపిస్తుండగా.. మంచు లక్ష్మి పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించింది. ఇక ఈ చిత్రానికి డైమండ్ రత్నబాబు కథ అందించారు. మధురెడ్డి ఎడిటర్ గా లిజో కె జోస్ సంగీతం, గోకుల్ భారతి కెమెరామెన్ గా వ్యవహరిస్తున్నారు.

YouTube video