తల్లైన తర్వాత ఫస్ట్ టైం కాజల్ అందాల ఆరబోత చేసింది

చందమామ ఫేమ్ కాజల్ మళ్లీ సినిమాల ఫై ఫోకస్ చేసిందా..అంటే అవుననే అంటున్నాయి తాజా ఫొటోస్. కెరియర్ స్పీడ్ ఉన్న టైంలోనే పెళ్లి చేసుకొని షాక్ ఇచ్చింది కాజల్. పెళ్లి తర్వాత తల్లయింది. ఒక బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత ఆమె శరీరంలో పలుమార్పులు వచ్చాయని చెప్పుకొచ్చింది. మళ్లీ సినిమాల్లో అడుగుపెట్టేందుకు జిమ్ లో కష్టపడుతున్నట్లు తెలిపిన ఈ భామ.. ప్రస్తుతం కష్టానికి తగిన ప్రతిఫలం దక్కుతున్నట్లు ఆమె షేర్ చేసిన పిక్స్ చూస్తే అర్ధం అవుతుంది. చక్కటి చీర లో కాజల్ అందాల ఆరబోత చేసింది. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతున్నాయి.

కాజల్ సినిమాల విషయానికి వస్తే. లక్ష్మి కళ్యాణం మూవీ తో 2007 లో తెలుగు ఇండస్ట్రీ లో అడుగుపెట్టింది. ఆ తర్వాత మగధీర తో పాపులర్ అయ్యింది. ఈ సినిమా తర్వాత మళ్లీ వెనక్కు చూసుకోవాల్సిన పనిలేకుండా పోయింది. ఎన్టీఆర్ , రవితేజ , రామ్ చరణ్, ప్రభాస్ వంటి యంగ్ హీరోలతో పాటు సీనియర్ హీరోల సరసన కూడా జోడి కట్టింది. మరి సెకండ్ ఇన్నింగ్స్ లో కాజల్ కు ఏ తరహా పాత్రలు వస్తాయో చూడాలి.