భారత్కు చేరిన చివరి 36వ రఫేల్ యుద్ద విమానం

36th-rafale-fighter-jet-to-arrive-in-india

న్యూఢిల్లీః 36వ రఫేల్ యుద్ద విమానం భారత్కు చేరుకుంది. ఫ్రాన్స్ నుంచి బయలుదేరిన 36వ ఎయిర్ క్లాఫ్ట్ యూఏఈలో ఇంధనం నింపుకుని భారత్ లో దిగింది. సుధీర్ఘ ప్రయాణం తర్వాత 36వ రఫేల్ యుద్ద విమానం భారత్లో అడుగుపెట్టిందని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ప్రకటించింది.

కాగా, ఆత్యాధునిక 36 రఫేల్ యుద్ద విమానాలను రూ.59,000 కోట్ల వ్యయంతో కొనుగోలు చేసేందుకు భారత్‌, ఫ్రాన్స్‌ మధ్య 2016లో ఒప్పందం జరిగింది. ఇందులో భాగంగా దశల వారీగా రఫేల్ ఎయిర్ క్లాఫ్ట్స్ భారత్ చేరుకున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరి 24 వరకు 35 రఫెల్స్ భారత్లో దిగాయి. తాజాగా చివరిదైన 36వ విమానం కూడా భారత్కు వచ్చేసింది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/telangana/