‘చందమామ’ మెటర్నిటీ ఫ్యాషన్

అంతర్జాలంలో ఫొటోలు వైరల్

Kajal Aggarwal Maternity Fashion in Denim look

‘చందమామ’ కాజల్ అగర్వాల్ త్వరలోనే తల్లిని కాబోతున్నానని ప్రకటించిన విషయం తెలిసిందే. అంతేకాదు , ఫోటోషూట్లతో అభిమానులకు ఇన్ స్టాలో టచ్ లోనే ఉంది ఈ కాబోయే తల్లి గర్భవతి గా సోషల్ మీడియాలో శుభవార్త ప్రకటించినప్పటి నుండి తన బేబీ బంప్ ప్రదర్శన ఆగలేదు. ప్రతిసారీ మెటర్నిటీ ఫ్యాషన్ ను పరిచయం చేస్తోంది .
తన విదేశీ విహారయాత్రల గురించి బయటపడింది. ఇంతకుముందు దుబాయ్ కి విహారయాత్రకు వెళ్లి ముంబైకి రాగానే , లేటెస్ట్ ఫోటోషూట్ ని రివీల్ చేసింది. . ఇది చాలా ట్రెండీగా ఉంది. లూజ్ డెనిమ్ లో కాజల్ తన బేబి బంప్ ని దాచేసింది. ఎంపిక చేసుకున్న డెనిమ్స్ ఎంతో అద్భుతంగా ఉంది. ఈ ఫోటోలకు ఖాళీ మహిళ మానసిక స్థితి అంటూ క్యాప్షన్ ఇచ్చింది. తను భర్తతో బస చేసిన హోటల్ ను ట్యాగ్ చేసింది. ప్రస్తుతం కాజల్ లుక్ అంతర్జాలంలో వైరల్ గా మారింది.

జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/national/