హాట్ కేకుల్లా అమ్ముడవుతున్న దసరా అడ్వాన్స్ టికెట్స్

నేచురల్ స్టార్ నాని , కీర్తి సురేష్ జంటగా తెరకెక్కిన మాస్ ఎంటర్టైనర్ ‘దసరా’. నూతన డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల డైరెక్ట్ చేసిన ఈ చిత్రం మార్చి 30 న పాన్ ఇండియా గా పలు భాషల్లో విడుదల కాబోతుంది. ఈ క్రమంలో ఈ చిత్ర అడ్వాన్స్ బుకింగ్ రీసెంట్ గా ఓపెన్ కాగా..అన్ని చోట్లా టికెట్స్ హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి.

హైదరాబాద్లో ని సింగిల్ స్క్రీన్ లు మల్టీప్లెక్స్ లలో చాలా షోలు పూర్తిగా అమ్ముడయ్యాయి. దీంతో నానికి బిగ్గెస్ట్ ఓపెనర్ అవ్వనుందని అంటున్నారు. తొలిరోజు టిక్కెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. మార్చి 30 అంటే శ్రీరామ నవమి సెలవు రోజు కావడంతో ఈ టికెట్స్ బుక్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇక నాని సినిమాకు నార్త్ లో కూడా మంచి ఓపెనింగ్స్ వచ్చే అవకాశం ఉందని చెపుతున్నారు.

దసరా సినిమాను తెలంగాణ కు చెందిన సింగరేణి నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో వస్తున్న దసరా లో నాని కీర్తి సురేష్ తో పాటు మరో కీలకపాత్రలో కన్నడ నటుడు దీక్షిత్ శెట్టి కీలక పాత్రలో కనిపించనున్నారు.