తెలంగాణ లో మరో కొత్త పార్టీ ..?

తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ ..ఇప్పటి నుండే ఎన్నికల వేడి పుడుతుంది. టిఆర్ఎస్, బిజెపి , కాంగ్రెస్ లతో పాటు ఈ మధ్యనే షర్మిల కూడా వైఎస్సార్ తెలంగాణ పార్టీ పెట్టి ప్రజల దగ్గరికి వెళ్తుంది. అలాగే మాజీ ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ బీఎస్పీ పార్టీలో చేరి టీఆర్ఎస్ వైఫల్యాలను ప్రజల్లో ఎండగట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న ఈ పార్టీలన్నీ అధికార టిఆర్ఎస్ పార్టీ ని టార్గెట్ చేయగా..ఇప్పుడు రాష్ట్రంలో మరో కొత్త రాబోతున్నట్లు తెలుస్తుంది.

బీసీల కోసం కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేయనున్నట్లు ఆర్.కృష్ణయ్య ప్రకటించారు. త్వరలో అన్ని కుల సంఘాలతో సమావేశం ఏర్పాటు చేస్తానని, ఏకాభిప్రాయం వస్తే పార్టీపై ప్రకటన చేస్తానని తెలిపారు. బీసీలను అన్ని పార్టీలు ఓటుబ్యాంకుగానే చూస్తున్నాయని విమర్శించారు. బీసీల కోసం రాజకీయ పార్టీ ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనలు వస్తున్నాయని, రాజ్యాధికారం వస్తేనే బీసీలు ఆర్థికంగా అభివృద్ధి చెందుతారని చెప్పుకొచ్చారు. మరి నిజంగానే ఆర్.కృష్ణయ్య పార్టీ పెడతారా అనేది చూడాలి.