తెలంగాణ కు నెక్స్ట్ సీఎం కేఏ పాలేనట


తెలంగాణ కు కాబోయే సీఎం నేనే అంటూ కేఏ పాల్ మునుగోడు ప్రచారంలో కీలక వ్యాఖ్యలు చేసారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మునుగోడు ఉప ఎన్నిక హోరు నడుస్తుంది. ఈ ఉప ఎన్నికలో ఎలాగైనా గెలిచి తీరాలని అన్ని పార్టీల నేతలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఉప ఎన్నికలో అన్ని పార్టీల నేతలు ప్రచారం చేస్తూ ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు. కేపాల్ సైతం ఈ ఉప ఎన్నికల్లో ఇండిపెండెంట్ కాండిడేట్ గా బరిలో నిలిచారు. గత కొద్దీ రోజులుగా ప్రచారం చేస్తూ వస్తున్నారు.

కాగా శనివారం మునుగోడు నియోజకవర్గం చండూరు లో కేఏ పాల్ హల్చల్ చేసారు. ‘చీఫ్ ఎలక్షన్ కమిషనర్ వికాస్ రాజ్ నా ఫాలోవర్ అంటూ… విధుల్లో ఉన్న ఓ అధికారి పై ఆగ్రహం వ్యక్తం చేసారు. నన్ను ఆపే అధికారం మీకు ఎవరు ఇచ్చారంటూ వాగ్వివాదానికి దిగారు. కేఏ పాల్ కు చెందిన రెండు ప్రచార వాహనాలు చండూరులో ప్రచార నిర్వహిస్తుండగా, వాటి వెనకాలే వస్తున్న కేఏ పాల్ ను అధికారులు అడ్డుకున్నారు. దీంతో కే ఏ పాల్ స్పందిస్తూ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ వికాస్ రాజ్ నా ఫాలోవర్.. నేను పర్మిషన్ తీసుకునే ప్రచారం నిర్వహిస్తున్నా.. నేను తెలంగాణకు కాబోయే ముఖ్యమంత్రినీ రెస్పెక్ట్ ఇవ్వండి అంటూ మండిపడ్డారు. సదరు అధికారినీ నీ పేరు ఎంటంటూ అధికారి మెడలోని ఐడి కార్డు లాక్కుని పేరు చూసే ప్రయత్నం చేశారు. దీంతో పక్కనే ఉన్న అధికారులు.. కె ఏ పాల్ కు సర్ది చెప్పడంతో ఆయన అక్కడి నుంచి వెళ్లిపోయారు. ప్రస్తుతం ఈ వీడియోస్ సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతున్నాయి.