ఎమ్మెల్సీగా ప్రమాణస్వీకారం చేసిన కవిత

Kalvakuntla Kavitha takes Oath as an MLC

హైదరాబాద్‌: నిజా‌మా‌బాద్‌ స్థానిక సంస్థల ఎమ్మె‌ల్సీగా కల్వ‌కుంట్ల కవిత ఈరోజు మ‌ధ్యాహ్నం ప్రమాణం స్వీకారం చేశారు. శాస‌న‌స‌మం‌డలి దర్బార్ హాల్‌లో మండలి చైర్మన్‌ గుత్తా సుఖేం‌ద‌ర్‌‌రెడ్డి.. ఆమె చేత ప్రమాణం చేయించారు. ఈ సంద‌ర్భంగా ఎమ్మెల్సీ క‌విత‌కు మండ‌లి ఛైర్మ‌న్ గుత్తా సుఖేంద‌ర్ రెడ్డితో పాటు మంత్రి వేముల ప్ర‌శాంత్ రెడ్డి, నిజామాబాద్ జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు శుభాకాంక్ష‌లు తెలిపారు.

కాగా ఈ నెల 9న జరి‌గిన నిజా‌మా‌బాద్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప‌ఎ‌న్ని‌కల్లో 88 శాతం ఓట్లతో కవిత ఘన విజయం సాధిం‌చారు. బిజెపి, కాంగ్రెస్‌ అభ్య‌ర్థు‌లకు కనీసం డిపా‌జిట్లు కూడా దక్క‌లేదు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/