ప్రాజెక్ట్ కే మేకింగ్ వీడియో రిలీజ్

బాహుబలి మూవీ తో పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు సాధించిన ప్రభాస్..ఆ తర్వాత సాహో, రాధే శ్యామ్ వంటి వరుస వరుస పాన్ మూవీస్ చేసి మరింత ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం ఒకటి , రెండు కాదు ఏకంగా నాల్గు పాన్ మూవీస్ ను లైన్ లో పెట్టాడు. వాటిలో ఆదిపురుష్ మూవీ ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇక కెజిఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో సలార్, మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ డైరెక్షన్లో ప్రాజెక్ట్ కె, మారుతీ డైరెక్షన్లో రాజా డీలక్స్ మూవీస్ చేస్తున్నాడు. ఈ మూడు కూడా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుగుతున్నాయి. వీటిలో నాగ్ అశ్విన్ డైరెక్షన్లో చేస్తున్న ప్రాజెక్ట్ కె చాల ప్రత్యేకం. ఈ మూవీ ఎవెంజర్స్ తరహాలో ఉండబోతుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ మూవీ లో ప్రభాస్ కనిపించబోతున్నాడు. అలాగే బాలీవుడ్ స్టార్ నటి నటులు ఈ మూవీ లో యాక్ట్ చేస్తున్నారు. దాదాపు రూ.500 కోట్ల బడ్జెట్ తో ఈ మూవీ ని నిర్మాత అశ్విని దత్ నిర్మిస్తున్నారు.

ఇదిలా ఉంటె తాజాగా మేకర్స్ సినిమాలో ఉప‌యోగించిన టైరుని ఎలా తయారు చేశామ‌నే విష‌యాన్ని తెలియ‌జేస్తూ ఓ వీడియోను విడుద‌ల చేశారు. ఈ వీడియోకు ‘రీ ఇన్వెంటింగ్ ది వీల్’ అని పేరు పెట్టారు. ఓ టైరు కోసం నాగ్ అశ్విన్ అండ్ టీమ్ ఎంత క‌ష్ట‌ప‌డ్డార‌నేది తెలియ‌జేసేలా వీడియో ఉంది. ‘ప్రాజెక్ట్ K’ సినిమా చేయ‌ట‌మే క‌ష్ట‌మండి. ఈ సినిమాను ఎలా వ‌ర్క‌వుట్ చేయాల‌నే దానిపై ఎక్కువ వ‌ర్క‌వుట్ చేయాలండి అని వీడియో నాగ్ అశ్విన్ చెప్ప‌టం.. దానికి తోడు ఆయ‌న మొత్తం స్క్రాచ్ నుంచి క్రియేట్ చేయాల‌ని చెప్ప‌టం.. అక్క‌డి నుంచి టైరు కోసం యూనిట్ ప‌డ్డ క‌ష్ట‌మంతా వీడియోలో చూపించారు. ప్రస్తుతం ఈ వీడియో అభిమానుల్లో సినిమా ఫై ఆసక్తి పెంచుతుంది.