అమరావతిలో జోరుగా సాగుతున్న ముళ్లకంపలు, చెట్ల తొలగింపు

ఏపీలో కూటమి విజయం సాధించడం తో అమరావతికి పూర్వ కళ రాబోతుంది. ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత ఏపీకి అమరావతిని రాజధానిగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత అక్కడ పెద్ద పెద్ద కట్టడాలు , ప్రభుత్వ ఆఫీసులు ఇలా అన్ని కట్టారు. కానీ ఇంతలోనే ఎన్నికలు రావడం వైసీపీ అధికారంలోకి రావడం జరిగింది. ఆ తర్వాత జగన్..ఏపీ రాజధాని అమరావతి కాదని..మూడు రాజధానులు ఏర్పాటు చేస్తామని చెప్పి అమరావతిని పూర్తిగా వదిలేసాడు. దీంతో అక్కడి కట్టడాలు అన్ని ఆలా ఉండిపోయాయి. విపరీతమైన చెట్లు , మొక్కలు పెరిగి కనీసం అటు రోడ్ కూడా కనిపించకుండా అయ్యింది.

ఇక ఇప్పుడు కూటమి అధికారంలోకి రావడంతో మళ్లీ అమరావతి లో పనులు జరుగుతున్నాయి. 109 కి.మీ నిడివిలోని 673 ఎకరాల విస్తీర్ణంలో కంపలను తొలగిస్తున్నారు. ఈ నెల 12న అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తుండడంతో అప్పటిలోగా అమరావతి రూపు మార్చేందుకు అధికారులు యుద్ధప్రాతిపదికన పనులు చేయిస్తున్నారు. ఈ పనులను సీఆర్‌డీఏ కమిషనర్‌ వివేక్‌ యాదవ్‌ పర్యవేక్షిస్తున్నారు. వందల జేసీబీలు రంగంలోకి దిగి రేయింబవళ్లనే తేడా లేకుండా ముళ్లకంపలను తొలగిస్తూ శుభ్రం చేస్తున్నాయి. రాజధాని పనుల్లో కదలికపై రైతులు, మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.