జూబ్లీహిల్స్లో రెండు బైకులను ఢీ కొట్టిన కారు..

హైదరాబాద్ మహానగరంలో ఓవర్ స్పీడ్ ముగ్గురి ప్రాణాలమీదకు తెచ్చింది. అతివేగం ప్రమాదకరం అని పోలీసులు , ఇంట్లో పెద్దవారు చెపుతున్నప్పటికీ చాలామంది వాటిని ఏమాత్రం పట్టించుకోండి అమాయకపు ప్రజల ప్రాణాలు తీస్తున్నారు. ప్రతి రోజు రాష్ట్రంలో పదుల సంఖ్యలో రోడ్డు ప్రమాదాలు జరుగుతూ..ప్రాణాలను తీస్తుండగా..బుధువారం సాయంతరం జూబ్లీహిల్స్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

కృష్ణా కృష్ణానగర్ కి చెందిన అన్నా చెల్లెల్లు ఉదయ్ , స్వీటీ కలిసి ద్విచక్ర వాహనం మీద కలిసి వెళ్తున్నారు. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 36 సెంట్రో గ్రాండీ దగ్గరకు రాగానే.. పక్కనే వేరొక బైక్ పై వెళ్తున్న మరొక వ్యక్తిని.. వెనుక నుంచి వచ్చిన వైట్ కలర్ స్పోర్ట్స్ కార్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ హెల్మెట్ కార్ కి వేలాడుతున్నా పట్టించుకోకుండా వెళ్లిపోయింది కారు. దీంతో రెండు బైకులపై వెళ్తున్న ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. గాయపడిన వారి పరిస్థితి విషమంగానే ఉన్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం వీరు మాదాపూర్ మెడికవర్ హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్నారు.