ఈ నెల 15న తెలంగాణ పర్యటనకు రానున్న జేపీ నడ్డా

JP Nadda will visit Telangana on 15th of this month

హైదరాబాద్‌ః బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలంగాణ పర్యటనలో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. ముందుగా నిర్ణయించినట్లు ఈ నెల 16వ తేదీకి బదులు ఈనెల15వ తేదీననే రాష్ట్రానికి రానున్నారు. ఈనెల 15వ తేదీన కరీంనగర్ లో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర ముగింపు సభలో జేపీ నడ్డా పాల్గొంటారు. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 17 న కరీంనగర్ లో పాదయాత్ర ముగింపు సభ నిర్వహించాల్సి ఉండగా నడ్డా షెడ్యూల్ వల్ల 16 కి కుదించారు. అయితే అదే రోజు జేపీ నడ్డా హిమాచల్ ప్రదేశ్ లో పర్యటించాల్సి ఉండడంతో జేపీ నడ్డా రాష్ట్ర పర్యటన.. బహిరంగ సభ షెడ్యూల ఈనెల 15 కు మారింది. దీంతో రెండు రోజుల ముందుగానే బండి సంజయ్ పాదయాత్ర ముగియనుంది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/news/national/