టీఆరఎస్ సర్కార్ ఫై నిప్పులు చెరిగిన జేపీ నడ్డా

,

బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా..టీఆరఎస్ సర్కార్ ఫై నిప్పులు చెరిగారు.బండి సంజయ్‌ను అరెస్ట్ చేయడంపై జేపీ నడ్డా ఆగ్రహం వ్యక్తం చేసారు. రాష్ట్రంలో తమ పార్టీకి లభిస్తోన్న మద్దతు చూసి కేసీఆర్ ఆందోళనకు గురవుతున్నారని అన్నారు.

ఈ మేరకు ట్విట్టర్ వేదికగా కేసీఆర్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. తెలంగాణలో మా పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ ను అక్రమంగా అరెస్టు చేయడాన్ని ఖండిస్తున్నామన్నారు. టీఆర్ఎస్ అవినీతి, కుటుంబ పాలనకు వ్యతిరేకంగా రాష్ట్ర నలుమూలల నుంచి బీజేపీకి లభిస్తున్న మద్దతు చూసి కేసీఆర్ కు భయం పట్టుకుందని జేపీ నడ్డా ఆయన విమర్శించారు. మేం ప్రజాస్వామ్యయుతంగా పోరాడి వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్, కేసీఆర్‌కు చరమగీతం పాడుతామని వ్యాఖ్యానించారు.

మరోపక్క మంగళవారం సాయంత్రం తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ను బీజేపీ నేతలు కలిశారు. బీజేపీ ప్రజా సంగ్రామ యాత్రకు అనుమతి ఇచ్చేలా ఆదేశించాలని కోరారు. ఈసందర్భంగా ఆమెకు వినతిపత్రం అందజేశారు. ప్రజా సంగ్రామ యాత్ర యధావిధిగా కొనసాగించడంతోపాటు భద్రత కల్పించాలని విన్నవించారు. హైదరాబాద్‌లో బీజేపీ కార్యకర్తలపై పోలీసులు, టీఆర్ఎస్ నాయకులు జరిపిన దాడిపై విచారణ జరిపించాలన్నారు.