ఎన్నికల బరిలో రచయిత జొన్నవిత్తుల

ప్రముఖ గీత రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఆయన విజయవాడ సెంట్రల్ నుంచి ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేశారు. సినిమాల్లో 600కు పైగా పాటలు రాసిన జొన్నవిత్తుల.. పేరడీ సాంగ్స్ మరింత పాపులర్ అయ్యారు. గతంలో ఆయన బీజేపీలో చేరి, ఆ తర్వాత బయటికొచ్చారు. ఇప్పుడు ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు.

తెలుగు శంఖారావం పేరుతో తెలుగు భాష మీద పాటలు రాశారు. 2005లో రాజేంద్ర ప్రసాద్ కథానాయకుడిగా పెళ్ళాం పిచ్చోడు అనే సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ సినిమాకు ప్రజాదరణ పొందిన ఉత్తమ చిత్రంగా నంది పురస్కారం లభించింది. తెలంగాణ విడిపోయినప్పుడు కొత్తగా ఏర్పడ్డ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నవనిర్మాణ దీక్షకై ప్రత్యేక గీతం రాశారు. జొన్న విత్తుల రాసిన గీతాన్ని వందేమాతరం శ్రీనివాస్‌ గానం చేశారు.