బిజెపి జాతీయ అధ్యక్షుడిగా జేపీ నడ్డా ఎన్నిక

నడ్డాకు బాధ్యతలు అప్పగించిన అమిత్ షా

Amit-Shah-JP-Nadda
Amit-Shah-JP-Nadda

న్యూఢిల్లీ: బిజెపి జాతీయ కొత్త అధ్యక్షుడిగా జేపీ నడ్డా ఈరోజు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అయితే జేపీ నడ్డా ఎన్నిక లాంఛనమేనని తెలిసినా, పార్టీ రాజ్యాంగం ప్రకారం ఎన్నికల ప్రక్రియ నిర్వహించి నామినేషన్ల స్వీకరణ జరిపారు. ఈ మధ్యాహ్నంతో నామినేషన్ల ఉపసంహరణ, పరిశీలన గడువు ముగియడంతో, నడ్డా జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికైనట్టు అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆయనకు పార్టీ పగ్గాలు అందించారు. ఇప్పటివరకు నడ్డా బిజెపి వర్కింగ్ ప్రెసిడెంట్ గా వ్యవహరించారు. కాగా గత ప్రభుత్వం హయాంలో నడ్డా కేంద్ర వైద్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం ఆయన హిమాచల్ ప్రదేశ్ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. నడ్డా పాట్నాలో జన్మించారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/