కాంగ్రెస్‌కు గ‌ట్టి ఎదురుదెబ్బ

సోనియాకు రాజీనామా లేఖ‌లు పంపిన జ‌మ్ము క‌శ్మీర్ నేత‌లు!

న్యూఢిల్లీ: జ‌మ్ము క‌శ్మీర్‌లో కాంగ్రెస్ పార్టీకి గ‌ట్టి ఎదురుదెబ్బ త‌గిలింది. పెద్ద‌సంఖ్య‌లో కాంగ్రెస్ నేత‌లు పార్టీని వీడుతూ అధినేత్రి సోనియా గాంధీకి లేఖ పంపారు. జ‌మ్ము క‌శ్మీర్‌లో పార్టీ ప‌రిస్ధితిపై ప‌రిశీల‌న జ‌రిపేందుకు అవ‌కాశం ఇవ్వ‌నందుకు నిర‌స‌న‌గా పార్టీ నుండి వైదొలుగుతున్నామ‌ని సోనియాకు రాసిన లేఖ‌లో వారు పేర్కొన్నారు.

జ‌మ్ము క‌శ్మీర్ పార్టీ చీఫ్ గులాం అహ్మ‌ద్ మిర్ అధ్య‌క్ష‌త‌న కాంగ్రెస్ పార్టీ దిగ‌జారుతోంద‌ని, ఇప్ప‌టివ‌ర‌కూ 200 ప్ర‌ముఖ కాంగ్రెస్ నేత‌లు పార్టీకి రాజీనామా చేసి ఇత‌ర పార్టీల్లో చేరారని లేఖ‌లో వారు వివ‌రించారు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/sports/