బిగ్ బాస్ 5 : పబ్లిక్ గానే సిరి ని ముద్దు అడిగిన జెస్సి

బిగ్ బాస్ 5 సీజన్ తెలుగు సక్సెస్ ఫుల్ గా పదోవారం పూర్తి చేసుకుంది. శనివారం ఎపిసోడ్ అంత హాట్ హాట్ గా సాగగా..ఆదివారం చిల్డ్రన్ స్పెషల్ తో సరదా సరదాగా సాగింది. చిల్డ్రన్ స్పెషల్ గా నాగ్.. చిన్నతనంలో ఆడుకున్న ఆటలు, ఓడిపోయిన కంటెస్టెంట్లకు స్కూల్‌లో విధించిన శిక్షలు వేశాడు. సెక్షన్ ఏ అంటూ షన్ను, ఆనీ, ప్రియాంక, సన్నీ టీంగా విడగొట్టాడు. మిగతా వాళ్లను సెక్షన్ బీలో వేశాడు. ఇక మానస్ సంచాలక్‌గా వ్యవహరించాడు. ఐస్, వాటర్, ఫైర్ అంటూ గార్డెన్ ఏరియాలో ఆటలు ఆడించాడు. కంటెస్టెంట్లందరూ కూడా పాటలకు డ్యాన్సులు వేస్తూ ఎంటర్టైన్ చేసారు.

ఇక ఈ వారం నామినేషన్ లో రవి , మానస్ , కాజల్ , సిరి లు ఉండగా..రవి , సిరి సేఫ్ అయ్యారు. ఆ తర్వాత కాజల్, మానస్‌లను టెన్షన్ పెట్టాడు నాగ్. కానీ ఇద్దరూ సేఫ్ అన్నట్టు తెలిపాడు. జెస్సీ ఆరోగ్యం బాగా లేకపోవడంతో అతను ఇంటి నుంచి బయటకు వెళ్తున్నాడు అని చెప్పి వారిని సంతోషంలో పడేసారు. ఇక సీక్రెట్ రూన్ నుండి బిగ్బ బాస్ వేదిక పైకి వచ్చిన జెస్సీ..హౌస్ సభ్యులతో ఒక్కొక్కరితో పర్సనల్‌గా ఫోన్‌లో మాట్లాడాడు. హౌస్ లో ఉన్న వారందరితో మాట్లాడి చివరగా సిరి , షణ్ముఖ్ లతో మాట్లాడాడు.

ఇక సిరితో మాత్రం చాలా సేపు మాట్లాడాడు.ముద్దు పెట్టవా? అని జెస్సీ అడగడం, అందరూ ఉన్నారు కదా? అని సిరి అనడం, ఆ తరువాత ఫోన్ లోంచే ముద్దులు పెట్టడం వామ్మో ఈ ఇద్దరూ నాగ్ ముందు సరసాలు ఆడేశారు. షన్నుతో చివరగా మాట్లాడిన జెస్సీ.. ఏం చెప్పాలి రా దీపుకి అని అన్నాడు. చూసిందే చెప్పు అని షన్ను అంటాడు. చాలా చూశా అని సెటైర్ వేస్తాడు జెస్సీ. మొత్తం మీద జెస్సి ఆరోగ్యం బాగాలేకపోవడం తో కాజల్ సేఫ్ అయ్యింది. లేదంటే ఈ వారం కాజల్ ఎలిమినేటి అయ్యేది.