తెలంగాణ తల్లి కన్న ముద్దుబిడ్డ కెసిఆర్‌

తన తండ్రికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన కెటిఆర్‌

CM KCR and Minister KTR
CM KCR and Minister KTR

హైదరాబాద్‌: ఇవాళ తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌ పుట్టిన రోజు సందర్భంగా ఐటి శాఖ మంత్రి కెటిఆర్‌ అమితానందాన్ని వ్యక్తం చేశారు.నాకు తెలిసి మానాన్న ధైర్యశాలి, దయామయుడు అని కితాబిచ్చారు. తెలంగాణ తల్లి కన్న ముద్దుబిడ్డ కెసిఆర్‌ అని కొనియాడారు. సోమవారం కెసిఆర్‌ తన 67వ పుట్టిన రోజు జరుపుకొంటున్న సందర్భంగా కెటిఆర్‌ విలక్షణమైన సందేశాన్ని ట్వీట్‌ చేశారు. కెసిఆర్‌ గొప్ప చరిష్మా గల నాయకుడు. ఆయనను నాన్నా అని పిలవడానికి నేనెంతో గర్వపడతాను. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తిగా ఆయన నాకు ఆదర్శం. దూరదృష్టి, నిబద్ధత కలిగిన మీరు కలకాలం ప్రజాసేవలో ఉండాలిగ అంటూ కెటిఆర్‌ ట్వీట్‌ చేశారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/