మాల్దీవుల్లో ఫుల్ గా ఎంజాయ్ …

వరుస చిత్రాలతో ఫుల్ బిజీగా ఉన్న పూజా హగ్దే..కాస్త షూటింగ్ లో గ్యాప్ రావడం తో మాల్దీవులకు చెక్కేసింది. అక్కడ దిగి దిగగానే రెడ్ హాట్ బికినీ తో చిల్ అవుతుంది..దీనికి సంబదించిన వీడియో షేర్ చేయడం తో సోషల్ మీడియా లో వేడి పుట్టిస్తుంది. నెటిజన్లు , ఫాలోయర్స్ , అభిమానులు ఆ వీడియో ను తెగ షేర్ చేస్తూ పండగ చేసుకుంటున్నారు.

ఇక సినిమాల విషయానికి వస్తే ..రీసెంట్ గా అఖిల్ తో చేసిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రం విడుదలై హిట్ అందుకుంది. ప్రభాస్ తో చేసిన రాధే శ్యామ్ జనవరి లో రిలీజ్ కాబోతుంది. దీని కోసం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. అలాగే మెగాస్టార్ చిరంజీవి – చరణ్ ల కలయికలో వస్తున్న ఆచార్య మూవీ లో చరణ్ కు జోడిగా నటిస్తుంది. ఈ మూవీ ఫిబ్రవరి లో రిలీజ్ కానుంది. ఇక హిందీ లో రణవీర్ సింగ్ సర్కస్ .. సల్మాన్ ఖాన్ తో భాయిజాన్ చిత్రాల్లోనూ నటిస్తోంది.

YouTube video