వచ్చే ఎన్నికల్లో విశాఖ నుంచి లోక్ సభకు పోటీ చేస్తా: జేడీ లక్ష్మీనారాయణ

తన భావాలకు మద్దతుగా ఉండే పార్టీతో ఉంటానని వెల్లడి

JD Lakshminarayana
JD Lakshminarayana

అమరావతిః వచ్చే ఎన్నికల్లో విశాఖ నుంచి లోక్ సభకు పోటీ చేస్తానని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ తెలిపారు. తాను ఏ పార్టీ నుంచి పోటీ చేస్తాననే విషయంపై సోషల్ మీడియాలో విస్తృతమైన ప్రచారం జరుగుతోందని చెప్పారు. తన భావజాలానికి అనుకూలంగా ఉండే పార్టీకి మద్దతుగా ఉంటానని తెలిపారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు మళ్లీ కలిస్తే బాగానే ఉంటుందని అభిప్రాయపడ్డారు. అయితే, రాష్ట్ర విభజన అంశం సుప్రీంకోర్టులో ఉందని తెలిపారు.

కాగా జేడీ లక్ష్మీనారాయణ గత ఎన్నికల్లో విశాఖ నుంచి పోటీ చేసి ఓటమిపాలైన సంగతి తెలిసిందే. తాజాగా ఆయన మాట్లాడుతూ రానున్న ఎన్నికలకు సంబంధించి తన ఆలోచనను వెల్లడించారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/news/national/