పేకాట ఆడుతూ పోలీసులకు చిక్కిన వినాయకుడు ఫేమ్ కృష్ణుడు

హైదరాబాద్ మియాపూర్ లోని విల్లాలో పేకాట ఆడుతూ వినాయకుడు ఫేమ్ కృష్ణుడు అరెస్ట్ అయ్యాడు. కృష్ణుడితో పాటు మరో 9 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కృష్ణుడితో పాటు పెద్దిరాజు గత కొద్దీ రోజులుగా పేకాటను నిర్వహిస్తున్నారు. విల్లాలో పేకాట నిర్వహిస్తున్నారని సమాచారం అందుకున్న పోలీసులు ఒక్కసారిగా ఆ విల్లా ఫై దాడులు చేయగా కృష్ణుడు తో పాటు పలువురు అడ్డంగా దొరికారు. దీనికి సంబదించిన వివరాలు తెలియాల్సి ఉంది.

ఇక కృష్ణుడు విషయానికి వస్తే ఈయన అసలు పేరు అల్లూరి కృష్ణంరాజు. ఇండస్ట్రీకి వచ్చిన తరవాత కృష్ణుడుగా పేరు మార్చుకున్నారు. వినాయకుడు సినిమాతో హీరోగా ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత పలు సినిమాల్లో హీరోగా , క్యారెక్టర్ అరెస్ట్ గా నటించి అలరించాడు. తూర్పుగోదావరి జిల్లాకే చెందిన ప్రముఖ దర్శకుడు వంశీ సినిమాలతో స్ఫూర్తి పొందిన కృష్ణుడు 20 ఏళ్ల క్రితం హైదరాబాద్‌కు వచ్చాడు. కృష్ణుడు పెదనాన్న ఏవీ సూర్యనారాయణ రాజు రాజోలు నియోజకవర్గానికి 25 ఏళ్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. ఎన్టీ రామారావు హయాంలో డిప్యూటీ స్పీకర్‌గా చేశారు. మొత్తం మీద ఒక పెద్ద కుటుంబం నుంచి సినిమా ఇండస్ట్రీకి వచ్చాడు కృష్ణుడు. కృష్ణుడు ప్రస్తుతం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆయన వైసీపీలో చేరారు.