మరోసారి యునెస్కో డైరెక్టర్‌ జనరల్‌గా ఆడ్రీ అజౌలే

పారిస్: ఐక్యరాజ్యసమితి సాంస్కృతిక సంస్థ అయిన యునెస్కో డైరెక్టర్‌ జనరల్‌ (డీజీ)గా ఫ్రెంచ్‌కు చెందిన ఆడ్రీ అజౌలే మరోసారి ఎన్నికయ్యారు. ఫ్రాన్స్‌ సాంస్కృతి శాఖ మాజీ మంత్రి ఆడ్రీ.. 2017లో మొదటిసారి యునెస్కో డీజీగా ఎన్నికయ్యారు. యునెస్కో సాధారణ సమావేశంలో డీజీ ఎంపికకు మంగళవారం జరిగిన ఎన్నికల్లో ఆడ్రీకి అనుకూలంగా 155 ఓట్లు పోలవగా, వ్యతిరేకంగా తొమ్మిది ఓట్లు మాత్రమే వచ్చాయి.

దీంతో ఆమె వరుసగా రెండోసారి డీజీగా బాధ్యలు చేపట్టనున్నారు. తమ సంస్థలో ఐక్యతకు ప్రతిరూపమే ఈ ఫలితమని ఆడ్రీ చెప్పారు. గత నాలుగేండ్లుగా తాము యునెస్కోపై విశ్వాసాన్ని పునరుద్ధరించగలిగామన్నారు. కొన్ని అంశాలలో సంస్థ విశ్వాసాన్ని పునరుద్ధరించుకోవాల్సి ఉందని వెల్లడించారు.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/movies/