బిఆర్ఎస్ – బిజెపి దీక్షలతో దద్దరిల్లుతున్న ఢిల్లీ

దేశ రాజధాని ఢిల్లీ వరుస దీక్షలతో దద్దరిల్లుతుంది. బిజెపి , బిఆర్ఎస్ పార్టీలు వరుసగా దీక్షలు చేస్తూ తగ్గిదేలే అంటున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు వ్యతిరేకంగా బీజేపీ నిరసన చేపట్టింది. ఆంధ్ర ఎడ్యుకేషన్‌ సొసైటీ దగ్గర బీజేపీ ధర్నాకు దిగింది. వాస్తవానికి జంతర్‌మంతర్‌లోనే ఈ నిరసన తెలపాలని బీజేపీ నిర్ణయించింది. కానీ అంతకంటే ముందే భారత జాగృతి సంస్థ మహిళా రిజర్వేషన్‌ బిల్లు ప్రవేశ పెట్టాలంటూ జంతర్‌మంతర్‌లో దీక్ష చేసేందుకు పోలిసుల నుండి పర్మిషన్ తీసుకుంది. దీంతో బీజేపీ దీన్ దయాల్ మార్గ్ లో నిరసన దీక్ష చేపట్టింది.

ఇక కవిత చేపట్టిన దీక్ష ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కొనసాగనుంది. కవితతోపాటు ఈ దీక్షలో 500 మంది కూర్చోనున్నారు. కవిత దీక్షకు దేశ వ్యాప్తంగా 18 ప్రతిపక్ష పార్టీలు మద్దతు ప్రకటించాయి. ఈ పార్టీల ప్రతినిధులు కవిత దీక్షలో కూర్చునున్నారు. అంతేకాదు దేశంలోని వివిధ మహిళా హక్కుల సంఘాలు కూడా కవిత దీక్షకు సంఘీభావం ప్రకటించాయి. ఉదయం 10 గంటలకు సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి దీక్షను ప్రారంభించనున్నారు. సాయంత్రం 4 గంలకు సీపీఐ కార్యదర్శి డి.రాజా దీక్షను ముగించనున్నారు.