ఢీ కొన్నబ‌స్సు, ఆయిల్ ట్యాంక‌ర్ .. 10 మంది మృతి

బార్మర్-జోధ్‌పూర్ హైవేపై ఘ‌ట‌న‌

జైపూర్‌: బ‌స్సులో మంట‌లు చెల‌రేగి 12 మంది ప్ర‌యాణికులు సజీవ దహనమ‌య్యారు. ఈ ఘోర ప్ర‌మాద ఘ‌ట‌న ఈ రోజు ఉద‌యం రాజస్థాన్‌లో చోటు చేసుకుంది. బార్మర్-జోధ్‌పూర్ హైవేపై ప్రైవేటు బస్సు, ఆయిల్‌ ట్యాంకర్ ప‌ర‌స్ప‌రం ఢీ కొట్టుకోవ‌డంతో బ‌స్సులో మంట‌లు చెల‌రేగాయి.

ప్ర‌మాదం జ‌రిగిన స‌మ‌యంలో బస్సులో మొత్తం 25 మంది ప్రయాణికులు ఉన్న‌ట్లు స‌మాచారం. మిగ‌తా వారి గురించి తెలియాల్సి ఉంది. బ‌స్సులోంచి ఇప్పటివరకు పది మృతదేహాలను రెస్క్యూ సిబ్బంది బయటకు తీశారు. మృతుల సంఖ్య పెరిగే అవ‌కాశం ఉంది. జిల్లా అధికారులు, పోలీసులు, రెస్క్యూ సిబ్బంది ప్ర‌మాద స్థ‌లి వ‌ద్ద సహాయ చర్యలు కొన‌సాగిస్తున్నారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/