రాయలసీమకు నీటి కష్టాలు తీరాలంటే తెలంగాణ లో కలపాల్సిందే..

రాయలసీమను తెలంగాణ లో కలిపితేనే రాయలసీమ లో నీటి కష్టాలు తీరుతాయని అన్నారు మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి. రాష్ట్రాలను విడగొట్టడం కష్టం కావచ్చని… కానీ, కలపడం మాత్రం సులభమేనని అన్నారు. రాయలసీమను తెలంగాణలో కలపడంపై ఎవరికీ అభ్యంతరాలు కూడా లేవని అయన్నారు. కొంతమంది ప్రత్యేక రాయలసీమ అంటున్నారని… ఒకవేళ ప్రత్యేక రాయలసీమ ఏర్పడితే సంతోషమేనని అన్నారు. జేసీ చేసిన తాజా వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.

ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం ఎంతగా అభివృద్ధి జరుగుతుందో తెలియంది కాదు..ఒకప్పుడు మహబూబ్ నగర్ , ఆదిలాబాద్ , నల్గొండ వంటి ప్రాంతాల్లో నీటి ఇబ్బంది ఉండేది కానీ ఇప్పుడు అక్కడ గోదావరి జిల్లాలను తలపిస్తున్నాయి. ఎటుచూసినా నీటితో కనిపిస్తున్నాయి. అంతే కాదు దేశంలో సగం వరి పంట తెలంగాణ లోనే పండించడం విశేషం. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ ఎంతో అభివృద్ధి చెందుతుంది. దీంతో తెలంగాణ పక్కన్నను జిల్లాలు సైతం తెలంగాణ లో కలపాలంటూ అక్కడి ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.