కరీంనగర్ జిల్లాలో పంట నష్టపోయిన రైతులను పరామర్శించిన బండి సంజయ్

తెలంగాణ లో అకాల వర్షాలతో వేలాది ఎకరాల్లో పంట నాశనం అవుతుంది. వడగండ్ల వానలతో వరి, మొక్కజొన్న, మామిడి తదతర పంటలకు నష్టం వాటిల్లింది. కళ్లాల్లో ఆరబోసిన ధాన్యం తడిసి ముద్దయింది. ఓ వైపు తీవ్ర ఎండలు.. మరోవైపు అకాల వర్షాలతో జనం ఇబ్బందులు పడుతున్నారు. గత మూడు రోజులుగా వడగండ్ల వాన రైతులను కన్నీరు పెట్టిస్తుంది.

తాజాగా కరీంనగర్ జిల్లాలో కురిసిన వాన కు రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఈ క్రమంలో సోమవారం బిజెపి రాష్ట్ర అధ్యక్షలు , ఎంపీ బండి సంజయ్ కరీంనగర్, చొప్పదండి నియోజకవర్గాల్లో పంట నష్టపోయిన రైతులను పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ..సీఎం కేసీఆర్ ఫై ఫైర్ అయ్యారు. ఫసల్ బీమా పరిహారం అమలు చేస్తే రైతులకు ఈ దుస్థితి వచ్చేది కాదని , కేసీఆర్ వల్ల రైతులు బిచ్చగాళ్ల లెక్క ప్రతిసారి అడుక్కోవాలా? అని ప్రశ్నించారు. వారంలో ఇస్తాననన్న పంట నష్టపరిహారం ఇంత వరకు ఎందుకు ఇవ్వలేదని బండి సంజయ్ ప్రశ్నించారు. కేసీఆర్ మాటలన్నీ కోతలేనన్నారు. ఏ రైతును కదిలించినా కన్నీళ్లే వస్తున్నాయని. 8 ఏళ్లలో పంట నష్టపోయిన ఏ ఒక్క రైతు కుటుంబాన్నైనా ఆదుకున్నారా అని ప్రశ్నించారు. పంట కొనుగోలు కేంద్రాలను తెరిచినట్లయితే సగం మంది రైతులకు నష్టం జరగకపోయేది కాదన్నారు.