బై..బై మోడీ అంటూ హైదరాబాద్ లో వెలిసిన ప్లెక్సీ లు

గత కొద్దీ నెలలుగా దేశ వ్యాప్తంగా ఈడీ , ఐటీ రైడ్స్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రతిపక్షపార్టీలు నేతలను టార్గెట్ గా ఈడీ రైడ్స్ జరుగుతుండడం తో బిజెపి తీరు ఫై ప్రతిపక్ష పార్టీలు మండిపడుతున్నాయి. ఈ క్రమంలో ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో భాగంగా ఎమ్మెల్సీ కవిత ను ఈరోజు ఈడీ అధికారులు విచారిస్తున్నారు. ఈ క్రమంలో ఢిల్లీ లోనే కాదు హైదరాబాద్ మహానగరంలోను మోడీ కి వ్యతిరేకంగా భారీ ఎత్తున ప్లెక్సీ లు ఏర్పటు చేసారు. బీజేపీలో చేరకముందు, చేరిన తర్వాత అంటూ.. ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్న కొందరు నాయకులను పేర్కొంటూ నగర వ్యాప్తంగా పోస్టర్లు అంటించారు. అయితే ఈడీ, సీబీఐ రైడ్స్‌ ముందు, తర్వాత ఎమ్మెల్సీ కవిత ఒకేలా ఉన్నారని, అసలైన రంగులు వెలసిపోవంటూ.. ఉద్యమనేతకు మద్దతు ప్రకటించారు.

అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న కేంద్ర మంత్రి జ్యోతిరాధిత్య సింధియా , అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ , పశ్చిమబెంగాల్ బీజేపీ నేత సువేందు అధికారి , ఏపీకి చెందిన వ్యాపారవేత్త, ఎంపీ సుజనా చౌదరి, కేంద్ర మాజీ మంత్రి నారాయణ్‌ రాణే ఐటీ, సీబీఐ రైడ్స్‌కు ముందు, తర్వాత రంగు మారినట్లు చూపించారు. తెలంగాణలో కవిత మాత్రం రైడ్స్‌కు ముందు, తర్వాత ఒకేలా ఉన్నారని.. అసలైన రంగులు వెలవంటూ పేర్కొన్నారు. చివర్లో బైబై మోదీ (#Bye Bye Modi) అంటూ హ్యాష్‌ టాగ్‌తో పోస్టర్లను అంటించారు.

మరోపక్క ఈరోజు కేంద్రమంత్రి అమిత్ షా హైదరాబాద్ కు రానున్నారు. ఈ క్రమంలో ఈ ప్లెక్సీ లు అంటిచడం కూడా వార్తల్లో హైలైట్ అవుతుంది.