బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తున్న జవాన్

షారుఖ్ ఖాన్ – అట్లీ కలయికలో తెరకెక్కిన జవాన్ మూవీ బాక్స్ ఆఫీస్ వసూళ్ల వర్షం కురిపిస్తుంది. హిందీ సినిమా చరిత్రలోనే తొలిరోజు అత్యధికంగా వసూలు చేసిన చిత్రంగా రికార్డు సృష్టించింది. ఇక రెండో రోజు శుక్రవారం కూడా బాక్సాఫీసు వద్ద దుమ్ముదులిపింది ‘జవాన్’. ఇండియాలోనే ఈ సినిమా రెండో రోజు రూ.53 కోట్ల నెట్ వసూలు చేసిందట. ఇది షారుఖ్ ఖాన్ గత చిత్రం ‘పఠాన్’ ఓపెనింగ్ డే కలెక్షన్‌తో ఇంచుమించుగా సమానమని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.

ప్రపంచ వ్యాప్తంగా రెండు రోజుల్లో ‘జవాన్’ గ్రాస్ కలెక్షన్ రూ.236 కోట్లకు చేరింది. ఇక ఇండియా విషయానికి వస్తే.. రెండు రోజుల్లో ‘జవాన్’ వసూలు చేసిన నెట్ కలెక్షన్ రూ.127 కోట్లుగా ఉంది. తొలిరోజు భారత్ బాక్సాఫీసు వద్ద రూ.74 కోట్ల నెట్ వసూలు చేసిన ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్.. రెండో రోజు రూ.53 కోట్ల నెట్ రాబట్టింది. ఇక తెలుగు లో కూడా ఈ మూవీ మంచి వసూళ్లు రాబడుతుంది. పాజిటివ్ టాక్ తో విడుదలైన ఈ చిత్రం..విడుదల తర్వాత కూడా సూపర్ హిట్ టాక్ తెచ్చుకోవడం తో కలెక్షన్లు భారీగా పెరుగుతున్నాయి.