ఎట్టకేలకు శ్రీను వైట్ల కొత్త చిత్రం ప్రారంభించాడు

శ్రీను వైట్ల..ఒకప్పుడు వరుస హ్యాట్రిక్ హిట్స్ తో ప్రేక్షకులను అలరించిన ఈయన..గత కొంతకాలంగా హిట్ మాట అంటుంచింతే..అసలు ఈయనకు ఛాన్స్ ఇచ్చే వారే లేకుండా పోయారు. 2018 లో రవితేజ తో అమర్ అక్బర్ ఆంథోనీ మూవీ చేసాడు. ఈ మొవేయి బాక్స్ ఆఫీస్ వద్ద భారీ డిజాస్టర్ అయ్యింది. దీని తర్వాత అడ్రెస్ లేకుండా పోయాడు. తాజాగా ఈరోజు తన కొత్త చిత్రాన్ని ప్రారంభించి వార్తల్లో నిలిచారు.

వరుస ప్లాప్ మూవీస్ తో సతమతవుతున్న హీరో గోపీచంద్ తో..శ్రీను వైట్ల ఓ సినిమా చేయబోతున్నాడు. చిత్రాలయం స్టూడియోస్ అనే కొత్త నిర్మాణ సంస్థ ప్రొడక్షన్ నంబర్ 1గా ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. శనివారం హైదరాబాద్‌లో ఈ చిత్ర ప్రారంభోత్సవం చాలా ఘనంగా జరిగింది. సినీ పరిశ్రమకు చెందిన అతిరథ మహారథులు ఈ చిత్ర ప్రారంభోత్సవంలో పాల్గొని చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలియజేశారు. దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు ఆశీస్సులతో గోపీచంద్ తన 32వ సినిమాను షురూ చేశారు.

పూజా కార్యక్రమాల అనంతరం ముహూర్తపు సన్నివేశానికి మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాత నవీన్ యెర్నేని కెమెరా స్విచ్ ఆన్ చేయగా.. దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు క్లాప్ ఇచ్చారు. ఫస్ట్ షాట్‌కు శ్రీను వైట్ల దర్శకత్వం వహించారు. ప్రముఖ నిర్మాతలు రమేష్ ప్రసాద్, ఆదిశేషగిరిరావు, సురేష్ బాబు, అనిల్ సుంకర, టీజీ విశ్వప్రసాద్, బెల్లంకొండ సురేష్, సుప్రియ, అచ్చిరెడ్డి, దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి, తదితరులు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. మరి ఈ సినిమా తోనైనా ఈ ఇద్దరు హిట్ కొట్టాలని అంత కోరుకుంటున్నారు.