జమ్మూలో జరిగిన భారీ ఎన్ కౌంటర్ లో నంద్యాల జిల్లా జవాన్ మృతి

జమ్మూకశ్మీర్‌లో జరిగిన ఎన్ కౌంటర్ లో నంద్యాల జిల్లా జవాన్ వీరమరణం పొందారు. జమ్మూకశ్మీర్‌ లో నిత్యం భద్రత దళాలకు , ఉగ్రవాదులకు మధ్య బీకర పోరు నడుస్తుంటుంది. ఈ క్రమంలో ఎంతోమంది వీర మరణం పొందుతుంటారు. తాజాగా జరిగిన ఎన్‌కౌంటర్‌లో నంద్యాల జిల్లాకు చెందిన యువ సైనికుడు వీరమరణం పొందాడు.

పాములపాడు మండలం మద్దూరు పంచాయతీలోని కృష్ణానగర్ గ్రామానికి చెందిన సిరిగిరి సురేంద్ర (24) 2019లో సైన్యంలో చేరారు. కశ్మీర్‌లోని బారాముల్లా ప్రాంతంలో విధులు నిర్వర్తిస్తున్న సురేంద్ర మూడు రోజుల క్రితం ఉగ్రవాదుల కాల్పుల్లో చనిపోయినట్టు కుటుంబ సభ్యులకు సైన్యాధికారుల నుంచి సమాచారం అందింది. ఆయన పార్థివదేహం నేడు స్వగ్రామం చేరే అవకాశం ఉంది. సెప్టెంబరులో వస్తానని మూడు రోజుల క్రితమే తల్లిదండ్రులు సుబ్బమ్మ, సుబ్బయ్యలకు చెప్పిన సురేంద్ర అంతలోనే మరణించాడనే వార్త ఆ కుటుంబంలో విషాదాన్ని నింపింది.

సుబ్బయ్య, సుబ్బమ్మ దంపతులకు ముగ్గురు సంతానం. ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. వీరిలో చిన్నకుమారుడు సిరిగిరి సురేంద్ర. నాగ్ పూర్ లో శిక్షణ పూర్తి చేసుకొని గాడ్జ్ రెజిమెంటల్ సెంటర్ లో శిక్షణ పూర్తి చేసుకొని బదునాకు వెళ్లాడు.. అక్కడ నుంచి కాశ్మీర్ లోని బారాముల జిల్లాలోని ఆర్మీ బెటాలియన్ లో విధులు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలోనే పాకిస్థాన్ బార్డర్ లో విధులు నిర్వహిస్తున్న సురేంద్రపై జులై 31న మధ్యాహ్నం ట్రక్ పై వచ్చిన ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో వీరమరణం పొందాడు.