నగరంలో రెండు భారీ అగ్నిప్రమాదాలు

హైదరాబాద్ మహానగరంలో ఈ మధ్య వరుస అగ్ని ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ ప్రమాదాల వాళ్ళ భారీగా ఆస్థి నష్టంతో పాటు ప్రాణ నష్టం వాటిల్లుతుంది. తాజాగా బుధవారం తెల్లవారుజామున రెండు అగ్నిప్రమాదాలు కలకలం రేపుతున్నాయి. హబ్సీగూడాలో, అత్తాపూర్ లో భారీ అగ్ని ప్రమాదాలు చోటుచేసుకున్నాయి.

హబ్సిగూడలోని అన్ లిమిటెడ్ షోరూంలో మంగళవారం అర్థరాత్రి దాటిన తరువాత మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న ఫైర్అ సిబ్బంది మూడు ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపుచేస్తున్నారు. ఉప్పల్ – సికింద్రాబాద్ ప్రధాన రహదారి కావడంతో పొగతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. ఘటనా స్థలం పక్కనే పెట్రోల్ బంక్ ఉండడంతో స్థానికులు భయాందోళనలో ఉన్నారు.

మరోవైపు అత్తాపూర్ హసన్ నగర్ లో కూడా భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఓ బట్టల గోదాంలో మంటలు చెలరేగాయి. దీంతో దట్టమైన పొగ వ్యాప్తితో స్థానికులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. రెండు ఫ్లోర్లలో వ్యాపించిన మంటలను అగ్నిమాపక సిబ్బంది ఆర్పుతున్నారు. మంటలు మరింత వ్యాపించకుండా అధికారుల చర్యలు చేపట్టారు. సమీప ఇళ్లకు మంటలు వ్యాపించకుండా అధికారులు చర్యలు చేపట్టారు. ఇలా ఒకేరోజు రెండు అగ్ని ప్రమాద ఘటనలు చోటుచేసుకున్నాయి.