మరోసారి ఆసుపత్రిలో చేరిన జపాన్ ప్రధాని
ఆరోగ్యం బాగానే ఉందన్న ఆర్థిక మంత్రి

జపాన్: జపాన్ ప్రధాని షింజో అబే అనారోగ్య సమస్యలతో మరోమారు ఆసుపత్రిలో చేరారు. టోక్యో ఆసుపత్రి వైద్యులు దాదాపు ఏడు గంటలపాటు ఆయనకు పరీక్షలు నిర్వహించారు. ప్రధాని ఆసుపత్రిలో చేరిన విషయం తెలియడంతో దేశవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ ఏడాది జులై 6న షింజో అబే తన కార్యాలయంలో రక్తపు వాంతులు చేసుకున్నట్టు అప్పట్లో వార్తలు వచ్చాయి.
కాగా, ప్రధాని సాధారణ పరీక్షల్లో భాగంగానే ఆసుపత్రికి వచ్చారని, ఆయన ఆరోగ్యంగానే ఉన్నట్టు ఆర్థిక మంత్రి కట్సునోబు కటో తెలిపారు. ప్రధాని పదవి నుంచి షింజో వైదొలగితే ఉప ప్రధానిగా ఉన్న తారో అసో తాత్కాలిక బాధ్యతలు స్వీకరించనున్నట్టు తెలుస్తోంది. ఒకవేళ ప్రధాని కనుక రాజీనామా చేయాలనుకుంటే ఎన్నికలు ముగిసి మరొకరు ప్రధాని అయ్యే వరకు షింజోనే ఆ పదవిలో కొనసాగుతారని సమాచారం.
తాజా వీడియోస్ కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/videos/