వ్యాక్సిన్ వేసుకోని 3వేల మంది మున్సిపల్ సిబ్బందిపై చర్యలు

న్యూయార్క్: అమెరికాలోని న్యూయార్క్ సిటీలో వ్యాక్సిన్ వేసుకోని మున్సిపల్ సిబ్బందిపై చర్యలు తీసుకోనున్నారు. సుమారు మూడు వేల మంది వర్కర్లను తొలగించేందుకు స్థానిక ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. డెడ్‌లైన్ లోపు కోవిడ్19 వ్యాక్సిన్ తీసుకోవాలని గతంలోనే ఆదేశాలు జారీ చేశారు. మున్సిపల్ కార్మికులంతా టీకాలు వేసుకోవాలని ప్రభుత్వం తన ఆదేశాల్లో పేర్కొన్నది. ప్రస్తుతం కరోనా ఆంక్షలను క్రమక్రమం ఎత్తివేస్తున్నారు. కొన్ని రాష్ట్రాల్లో మాస్క్ నియమావళిని కూడా ఎత్తివేశారు. న్యూయార్క్ నగరంలో పనిచేస్తున్న ఉద్యోగులు, పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, టీచర్లు కనీసం ఒక్క డోసు టీకా తీసుకుని ఉండాలని గత ఏడాది ఆ నగర మేయర్ ఆదేశాలు జారీ చేశారు.
తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/