కరోనాను నివారించే యాంటీ బాడీ సిద్దం

ఇజ్రాయెల్ రక్షణ మంత్రి నెఫ్తాలీ బెన్నెట్ వెల్లడి

కరోనాను నివారించే యాంటీ బాడీ సిద్దం
naftali-bennett

ఇజ్రాయెల్‌: ఇజ్రాయెల్ పరిశోధకులు కరోనా వైరస్ ను అంతమొందించే యాంటీ బాడీని అభివృద్ధి చేయడం పూర్తయిందని తెలిపారు. ఈమేరకు ఈ విషయాన్ని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి నెఫ్తాలీ బెన్నెట్ ప్రకటించారు. ఈ యాంటీబాడీ పేటెంట్ కోసం ఇజ్రాయెల్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ బయోలాజికల్ రీసెర్చ్ (ఐఐబీఆర్) ఇప్పటికే చర్యలు చేపట్టినట్టు పేర్కొంది. తదుపరి దశలో వాణిజ్య పరంగా పెద్ద ఎత్తున యాంటీబాడీలను ఉత్పత్తి చేసేందుకు అంతర్జాతీయ తయారీ సంస్థలను సంప్రదిస్తామని అన్నారు. తమ పరిశోధకులు ఈ ఘనతను సాధించడం గర్వకారణమంటూ బెన్నెట్ సంతోషం వ్యక్తం చేశారు. కాగా, ఐఐబీఆర్ పరిశోధన శాలలను రెండు రోజుల క్రితం బెన్నెట్ పరిశీలించిన విషయాన్ని తెలియజేస్తూ ఇజ్రాయెట్ పీఎంఓ ఒక ప్రకటన విడుదల చేేసింది.


తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/movies/