జిల్లా దవాఖాను సందర్శించిన మంత్రులు

మహబూబాబాద్: వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్, పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మహబూబాబాద్ జిల్లా దవాఖాను సందర్శించారు. కరోనా వార్డులో కరోనా బాధితులకు అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. అధైర్య పడకుండా ధైర్యంగా కరోనాను ఎదుర్కోవాలని సూచించారు. అనంతరం జెడ్పీ చైర్ పర్సన్ అంగోతు బిందు, ఎమ్మెల్యే శంకర్ నాయక్, కలెక్టర్ విపీ గౌతం, అడిషనల్ కలెక్టర్, వైద్యశాఖ అధికారులతో కలిసి జిల్లాలో కరోనా స్థితిగతులు, వైరస్ నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షిస్తున్నారు.
తాజా ఏపి వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/