చంద్రబాబు నివాసానికి జనసేనాని పవన్ కల్యాణ్

Janasena Pawan Kalyan to Chandrababu’s residence

అమరావతిః టిడిపి, జనసేన కూటమి అభ్యర్థుల తొలి జాబితా కాసేపట్లో విడుదల కాబోతోంది. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో ఈ జాబితాను విడుదల చేయనున్నారు. ఈ క్రమంలో మంగళగిరిలోని జనసేన కార్యాలయం నుంచి చంద్రబాబు నివాసానికి జనసేనాని పవన్ కల్యాణ్ బయల్దేరారు. ఆయనతో పాటు నాదెండ్ల మనోహర్, మరికొందరు జనసేన నేతలు ఉన్నారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఇద్దరూ కలిసి ప్రెస్ మీట్ నిర్వహించబోతున్నారు. చంద్రబాబు నివాసం ముందు ప్రెస్ మీట్ కు ఏర్పాట్లు చేశారు.

ఈ సమావేశంలో తొలి జాబితాను విడుదల చేయనున్నారు. తొలి జాబితాలో 60 నుంచి 65 మంది అభ్యర్థులు ఉండే అవకాశం ఉంది. కొందరు ఎంపీల పేర్లను కూడా ప్రకటించవచ్చని తెలుస్తోంది. తొలి జాబితా విడుదల అవుతున్న నేపథ్యంలో టికెట్లను ఆశిస్తున్న నేతలతో పాటు… ఇరు పార్టీల అభిమానులు, మద్దతుదారుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.