వైస్సార్సీపీ ఎమ్మెల్యే ఇంట్లో పనిచేసే పనిమనిషి ఆత్మహత్య

Suicide that the corona got positive
suicide

నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే కిలిమేటి సంజీవయ్య ఇంట్లో పనిచేసే పనిమనిషి ఆత్మహత్య చేసుకొని చనిపోవడం ఇప్పుడు నియోజకవర్గం లో హాట్ టాపిక్ గా మారింది. ఎమ్మెల్యే కార్యాలయంలో పనిచేసే వ్యక్తి వేధింపులే దీనికి కారణమని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఆమె ఆత్యహత్యకు పాల్పడిన నాలుగు రోజుల తర్వాత తనకు సమాచారం ఇచ్చారని బాధితురాలి భర్త అంటున్నారు. అయితే ఆమె ఎందుకు ఆత్మహత్య చేసుకుందనే దానిపై వివరాలు తెలియాల్సి వుంది

సంజీవయ్య ఇంట్లో చాలా కాలంగా అరుణకుమారి అనే ఒక వివాహిత పనిమనిషిగా ఉంటోంది. అయితే ఎమ్మెల్యే ఇల్లు అన్నాక ఎమ్మెల్యే ఆఫీస్ లో పనిచేసే వారు ఇంటికి వస్తూ పోతూ ఉంటారు. ఎమ్మెల్యే కార్యాలయంలో పనిచేసే వ్యక్తి వేదిస్తుండే వాడట. మరి అతడు ఎవరు..అనేది పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.