జెస్సి పది వారాలకు గాను ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నాడంటే..

విజయవాడకు చెందిన జశ్వంత్‌ మోడల్‌గా, యాక్టర్‌గా రాణిస్తూ బిగ్‌బాస్‌ 8వ కంటెస్టెంట్‌గా చోటు సంపాదించాడు. మొదటి నుంచి కూడా ఒక చిన్న పిల్లాడి తరహాలో హౌస్లో కొనసాగుతూ వచ్చాడు. అతను ఎంట్రీ ఇచ్చినప్పుడు జనాలు పెద్దగా ఆసక్తి చూపలేదు. ఎందుకంటే జెస్సీ ఫ్యాషన్ వరల్డ్ లో తప్పితే బయట జనాలకు పెద్దగా తెలియదు. రెండు , మూడు వారాల తర్వాత జెస్సి లోని మరో రొమాంటిక్ యాంగిల్ బయటకు తీసి యూత్ ను ఆకట్టుకునే ప్రయత్నం చేసాడు.

షణ్ముఖ్ జస్వంత్ సిరి జెస్సీ ముగ్గురు కూడా హౌస్ లో త్రిమూర్తులుగా కనిపించేవారు. ఎన్ని గొడవలు జరిగినా కూడా ముగ్గురు కూడా కలిసి కట్టుగా ఉండేవారు. మొత్తానికి పది వారాల పాటు కొనసాగిన జెస్సి ఎవరు ఊహించని విధంగా అనారోగ్య కారణంతో ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. ఇక జెస్సి బిగ్ బాస్ ఒప్పందం ప్రకారం వారానికి 1.5 లక్షల రెమ్యునరేషన్ అందుకున్న అతను మొత్తంగా 10 వారాలకు గాను 15 లక్షల వరకు పారితోషికం తీసుకున్నట్లు తెలుస్తోంది. అసలైతే మొదటి రెండు మూడు వారాల్లోనే బయటకు వెళ్ళిపోతారు అని అందరూ అనుకున్నారు. కానీ అదృష్టవశాత్తు ఫిజికల్ టాస్క్ లో తన బలాన్ని చూపిస్తూ ముందుకు సాగుతూ వచ్చాడు. ప్రస్తుతం ఈయన కాచిగూడలోని టీఎక్స్‌ ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నాడు.