యూఎస్ లో వెయ్యి స్క్రీన్ లలో ఆర్ఆర్ఆర్ విడుదల

దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆర్​ఆర్​ఆర్’​. దాదాపు రూ.450 కోట్ల భారీ బడ్జెట్‌తో ‘ఆర్ఆర్ఆర్’ ను దానయ్య రూపొందిస్తున్నారు. అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్‌ , కొమురం భీమ్‌గా ఎన్టీఆర్​ నటిస్తున్నారు. సంక్రాంతి కానుకగా 2022, జనవరి 7న విడుదల కానుంది. కీరవాణి సంగీతం అందిస్తుండగా..అజయ్ దేవగన్ , అలియా భట్ మొదలగు వారు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులతో పాటు చిత్ర ప్రమోషన్ చేస్తూ సినిమా ఫై అంచనాలు పెంచేస్తున్నారు.

బాహుబలి తర్వాత రాజమౌళి నుండి వస్తున్న సినిమా కావడం తో వరల్డ్ వైడ్ గా ఈ మూవీ ని చూడాలనే ఆసక్తి నెలకొని ఉంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఓవర్సీస్ లోను భారీ ఎత్తున రిలీజ్ చేయబోతున్నారు. ప్రస్తుతం అందుతున్న సమాచారం మేరకు ఆర్ ఆర్ ఆర్ యూఎస్ డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాను అమెరికాలో అతి పెద్ద థియేటర్ చైన్ అయిన సినిమార్క్ తో ఒప్పందం చేసుకుందట. యూఎస్ లో సినిమార్క్ కు దాదాపుగా 350 మల్టీ ప్లెక్స్ లు ఉన్నాయి.

మొత్తంగా 288 సినిమార్క్ మల్టీ ప్లెక్స్ ల్లో వెయ్యికి పైగా స్క్రీన్స్ ల్లో మొదటి మూడు రోజులు ఆర్ ఆర్ ఆర్ స్క్రీనింగ్ అవ్వబోతున్నట్లుగా సమాచారం అందుతోంది. అంటే ఆ మూడు రోజులు కూడా అమెరికాలో ఎక్కడ చూసినా కూడా ఈ సినిమా నే కనిపించబోతుంది. కేవలం సినిమార్క్ థియేటర్ చైన్ లోనే కాకుండా ఇతర మల్టీ ప్లెక్స్ ల్లో కూడా ఈ సినిమా ను స్క్రీనింగ్ చేయనున్నారని తెలుస్తుంది.