గంగా విలాస్ యాత్ర ఫై జైరాం రమేశ్ విమర్శలు

‘గంగా విలాస్’ యాత్ర ఫై కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ ట్విట్టర్ ద్వారా విమర్శలు చేసారు. ప్రధాని మోడీ గంగా విలాస్ యాత్రను ప్రారంభించారు. ప్రపంచంలోనే అతిపెద్ద రివర్ క్రూజ్ టూర్ ఇది. ఈ టూర్ వారణాసిలో ప్రారంభం అవుతుంది. 51 రోజుల పాటు యాత్ర కొనసాగి దిబ్రుగఢ్‌లో టూర్ ముగుస్తుంది. భారతదేశంలోని ఐదు రాష్ట్రాలతో పాటు బంగ్లాదేశ్‌‌లోని పలు ప్రాంతాలను కవర్ చేస్తూ టూర్ సాగుతుంది. క్రూజ్ సుమారు 4,000 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. అందులో బంగ్లాదేశ్‌లోనే 1,100 కిలోమీటర్లు కవర్ అవుతుంది. 51 రోజుల యాత్రలో 50 టూరిస్ట్ స్పాట్స్ కవర్ అవుతాయి.

ఈ యాత్ర ఫై కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ ట్విట్టర్ ద్వారా విమర్శలు చేసారు. ఒక్క రోజు ప్రయాణానికి రూ.50 వేలు వెచ్చించే స్తోమత సామాన్యులకు ఉంటుందా.. బాగా ధనవంతులు తప్ప గంగా విలాస్ యాత్ర ఖర్చును ఎవరైనా భరించగలరా.. అంటూ విమర్శలు గుప్పించారు. గంగా విలాస్ యాత్ర కేవలం ధనవంతుల విలాసం కోసమేనని జైరాం రమేశ్ ఆరోపించారు. ఈ క్రూయిజ్ తో గంగా నదిలోని జలచరాలకు ముప్పు వాటిల్లడం, గంగా నది కలుషితం కావడం తప్ప సామాన్యులకు ఒరిగేదేమీలేదని మండిపడ్డారు.