ప్రమాదానికి గురైన బిచ్చగాడు హీరో

బిచ్చగాడు ఫేమ్ విజయ్ ఆంటోని ప్రమాదానికి గురయ్యారు. బిచ్చగాడు మూవీ తో తెలుగు ఆడియన్స్ ను అలరించిన విజయ్..ఆ తర్వాత పలు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ బిచ్చగాడు మూవీ లెవల్లో అలరించలేకపోయారు. ప్రస్తుతం బిచ్చగాడు మూవీ సీక్వెల్ చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ మలేసియా లో జరుగుతుంది. ఈ షూటింగ్ జరుగుతుండగా అయన ప్రమాదానికి గురయినట్లు తెలుస్తుంది.

ప్రమాదానికి గురైన వెంటనే చిత్ర యూనిట్ హుటాహుటిన మలేషియాలోని ఓ హాస్పటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి కుదుటిగా ఉంది అని.. త్వరలో కోలుకుంటారు అని వైద్య బృందం వెల్లడించింది. ఈ విషయం తెలుసుకున్న ఆంటోనీ ఫ్యామిలీ మలేషియా కు బయలుదేరుతున్నట్లు తెలుస్తోంది. బోట్ లో ఒక సన్నివేశం చిత్రీకరిస్తుండగా ఈ ప్రమాదం జరిగిందట. వేగంగా ప్రయాణిస్తున్న బోటు అదుపుతప్పి పడవని ఢీ కొట్టిందట. దీంతో ఈ ప్రమాదం జరిగినట్లు చిత్ర యూనిట్ తెలిపారు.