జైలర్ నుంచి కావాలా లిరికల్ వీడియో సాంగ్ రిలీజ్

సూపర్ స్టార్ రజనీకాంత్ హిట్ , ప్లాప్ లతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం నెల్సన్ దిలీప్ కుమార్‌ డైరెక్షన్లో జైలర్ మూవీ చేస్తున్నాడు. మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని సన్‌ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్‌ తెరకెక్కిస్తున్నారు. యాక్షన్‌ కామెడీ బ్యాక్‌ డ్రాప్‌లో వస్తున్న జైలర్‌ చిత్రానికి అనిరుధ్‌ రవిచందర్‌ మ్యూజిక్ అందిస్తున్నాడు.

గురువారం ఈ సినిమాలోని కావాలా అంటూ సాగే లిరికల్ వీడియో సాంగ్ ను రిలీస్ ఇచ్చేసారు మేకర్స్. ఈ సాంగ్ లో తమన్నా హాట్‌ హాట్‌ స్టెప్పులతో రజని తోకలిసి స్టెప్స్ వేసింది. ఈ సాంగ్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఇక ఈ మూవీ లో మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్‌, సునీల్‌, కన్నడ స్టార్ హీరో శివరాజ్‌కుమార్‌, రమ్యకృష్ణ, యోగిబాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే జైలర్‌ నుంచి మేకర్స్‌ విడుదల చేసిన మోహన్‌ లాల్‌, సునీల్‌, తమన్నా లుక్స్‌ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతున్నాయి.

YouTube video