భోళా శంకర్ పక్కా మాస్ ఎంటర్టైనర్ అంటున్న చిరంజీవి

భోళా శంకర్ టీజర్ విడుదలైంది. మెగాస్టార్ చిరంజీవి – మెహర్ రమేష్ కలయికలో తెరకెక్కుతున్న ఈ మూవీ లో తమన్నా హీరోయిన్ గా నటిస్తుండగా , కీర్తి సురేష్ చిరంజీవి కి చెల్లెలు పాత్రలో కనిపించబోతుంది. అలాగే సుశాంత్ ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. భారీ బడ్జెట్ తో అనిల్ సుంకర నిర్మిస్తున్న ఈ మూవీ ఆగస్టు 11 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ క్రమంలో మెగాస్టార్ చిరజీవి తన పాత్ర తాలూకా డబ్బింగ్ ను పూర్తి చేసి , సినిమా ఎలా ఉందొ తెలిపాడు.

“సినిమా అవుట్ ఫుట్ చాలా బాగా వచ్చింది. ఇది పక్కా మాస్ ఎంటర్టైనర్. ఆడియన్స్ కి బాగా నచ్చుతుంది” అంటూ కాన్ఫిడెన్స్ ని తెలియజేశాడు. ఇక చిరు కాన్ఫిడెన్స్ చూసి అభిమానుల్లో సినిమా పై అంచనాలు మొదలు అవుతున్నాయి. కాగా ఈ సినిమా తమిళ హిట్ మూవీ ‘వేదాళం’కి రీమేక్ గా వస్తుంది. గ్యాంగ్ స్టార్ నేపథ్యంతో ఈ సినిమా సాగనుంది. మహతి స్వర సాగర్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు.