చంద్రబాబు సభలో జై ఎన్టీఆర్ ..సీఎం ఎన్టీఆర్ అంటూ నినాదాలు

తెలంగాణ లో మళ్లీ టీడీపీ పూర్వ వైభవం తీసుకరావాలని చంద్రబాబు చూస్తున్నాడు. ఈ క్రమంలో మళ్లీ కార్యకర్తల్లో జోష్ నింపేందుకు పర్యటనలు , సభలు చేస్తున్నారు. బుధువారం ఖమ్మం లో భారీ సభ ఏర్పాటు చేసారు. ఈ సభ కు పెద్ద ఎత్తున ప్రజలు హాజరయ్యారు. ఈ సభలో చంద్రబాబు తో పాటు హరికృష్ణ కూతురు సుహాసిని సైతం హాజరయ్యారు.

ఈ సందర్బంగా చంద్రబాబు ప్రసంగిస్తుండగా.. జూ. ఎన్టీఆర్ అభిమానులు పెద్ద ఎత్తున ఎన్టీఆర్ కు సంబంధించి స్లోగన్లు.. ఫ్లెక్సీలు ప్రదర్శిస్తూ నానా హడావిడి చేసారు. సీఎం ఎన్టీఆర్ ..సీఎం ఎన్టీఆర్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేసారు. అంతకు ముందు చంద్రబాబు హైదరాబాద్ నుంచి భారీ కాన్వాయ్ తో బయలు దేరారు. ముందుగా ఖమ్మం సరిహద్దులోని నాయకన్ గూడెం చేరుకున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబుకు పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. దారి పొడువునా కార్యకర్తలు అభిమానులు బాబుకు స్వాగతం పలికారు. ఖమ్మం సర్దార్ స్టేడియంకు భారీ ర్యాలీగా చేరుకుని చంద్రబాబు ప్రసంగించారు.

చాలా రోజుల తర్వాత తాను ఖమ్మం వచ్చాననీ. ఈ సభకు మీరంతా వచ్చారనీ. అందులోనూ మీలో యువత ఎక్కువగా ఉన్నారనీ.. సంతోషం వ్యక్తం చేశారు చంద్రబాబు. తాను అధికారం కోరుకోలేదనీ. మీ అభిమానం మాత్రమే కోరుకున్నాననీ అన్నారు.