జగిత్యాలలో ఓటు వేసిన ఎస్‌పి సింధు శర్మ

SP Sindhu sharma
SP Sindhu sharma

జగిత్యాల: తెలంగాణలో మున్సిపల్‌ ఎన్నికలు ప్రశాతంగా కొనసాగుతున్నాయి. జగిత్యాల జిల్లాలోని ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఓటు వేసేందుకు జనం పోలింగ్‌ కేంద్రాల వద్ద బారులు తీరారు. జగిత్యాల జిల్లా పరిధిలో ఎన్నికల భద్రతా ఏర్పాట్లపై ఎస్‌పి సింధుశర్మ పర్యవేక్షించారు. అదే సమయంలో జగిత్యాలలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల థరూర్‌ క్యాంపులోని పోలింగ్‌ కేంద్రంలో ఎస్‌పి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం ఎన్నికల్లో భద్రతా ఏర్పాట్లపై అధికారులతో ఎస్‌పి సింధుశర్మ చర్చించారు.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/