చంద్రయాన్-3 పై ఇస్రో తాజా వివరాలు
నలుగురు వ్యోమగాముల ఎంపిక.. రష్యాలో శిక్షణ
బెంగళూరు: చంద్రయాన్3పై ఇస్రో చైర్మన్ కె.శివన్ తాజా వివరాలు వెల్లడించారు. చంద్రయాన్3 కార్యక్రమం షురూ అయిందని, పనులు శరవేగంగా జరుగుతున్నాయని తెలిపారు. ఈ బృహత్తర కార్యక్రమం కోసం నలుగురు వ్యోమగాములను ఎంపిక చేశామని, ఈ నెలాఖర్లో వారు రష్యాలో శిక్షణ పొందుతారని వివరించారు. 1984లో సోవియట్ వ్యోమనౌక ద్వారా రాకేశ్ శర్మ అంతరిక్ష యానం చేశాడని, ఇప్పుడు భారత వ్యోమనౌక ద్వారా భారతీయులు రోదసి యాత్రలో పాల్గొంటున్నారని చెప్పారు. రోదసిలో అడుగుపెట్టిన తొలి భారతీయుడిగా రాకేశ్ శర్మ చరిత్ర పుటల్లో నిలిచిపోయాడు. రాకేశ్ శర్మ 1984 ఏప్రిల్ 2న నాటి సోవియట్ యూనియన్ కు చెందిన సోయుజ్ టి11 వ్యోమనౌకలో ప్రయాణించి అంతరిక్షంలో కాలుమోపాడు.
తాజా కెరీర్ వార్తల క్లిక్ చేయండి:https://www.vaartha.com/specials/career/