నేడు ఏపిలో జగనన్న జీవక్రాంతి పథకం ప్రారంభం

AP CM YS Jagan
AP CM YS Jagan

అమరావతి: ఏపిలో ఈ రోజు జగనన్న జీవక్రాంతి పథకం ప్రారంభించనున్నారు. సచివాలయం నుంచి పథకాన్ని సిఎం జగన్‌ ప్రారంభిస్తారు. జీవకాంత్రి పథకం ద్వారా 4560 ఏళ్ల వయస్సు లోపు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మహిళలకు గొర్రెలు, మేకలు ఇస్తారు. ప్రభుత్వ ఆర్థీక సాయంతో పాటు, బ్యాకు రుణాన్ని ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2.49 లక్షల గొర్రెలు, మేకల యూనిట్లను పంపిణీ చేసేందుకు రూ. 1868.63 కోట్లు వ్యయం చేయనున్నారు. ఈ పథకం ద్వారా నిరుపేద మహిళలకు ఉపాధి కలుగుతుంది. ఈ పథకంతో గ్రామీణ ఆర్థికాభివృద్ధికి ఎంతో దోహదపడుతుందని అధికారులు చెబుతున్నారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/